MLA :రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలి

రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలి అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Chintakunta Vijayaramanarao)అన్నారు.

Update: 2024-10-29 11:50 GMT

దిశ, జూలపల్లి : రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలి అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Chintakunta Vijayaramanarao)అన్నారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్కాపూర్, కాచాపూర్, కుమ్మరికుంట, కోనారావుపేట గ్రామాల్లో మంగళవారం సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ (2 lakh loan waiver)చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.

    అలాగే రైతన్నలకు పంటల పెట్టుబడికి రుణాలు ఇచ్చినట్టు చెప్పారు. టెక్నికల్ ఇబ్బందుల వల్ల మిగిలిన కొంతమంది రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. సన్న ధాన్యం పంట వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చెప్పి వాటిని కొనుగోలు చేయకుండా మోసం చేశారని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు సన్న వడ్లను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి క్వింటాకు రూ.500 బోనస్ (Rs.500 bonus)అందిస్తుందని చెప్పారు. ఏనాడూ రైతుల సంక్షేమానికి పాటుపడని, రుణమాఫీ చేయని బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, సామా రాజేశ్వర్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, డైరెక్టర్లు, మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News