Rain Effect : చెరువును తలపిస్తున్న స్కూల్..

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ప్రాథమిక

Update: 2024-07-19 12:41 GMT

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల చెరువు ను తలపిస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల మైదానం పూర్తిగా వర్షపు నీటితో నిండి మెయిన్ రోడ్డు పైకి చేరుకొని పిల్లలు బడి లోకి రావడానికి సరైన దారి లేక నిండిన మైదానం చెరువు ను తలపిస్తూ విద్యార్థులకు ఇబ్బంది గా తయారైంది. స్కూల్ సమీపంలో కాలి స్థలం ఎక్కువగా ఉండటం తో వర్షపు నీటికి విష పురుగులు సంచరించే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు.నీటి నిల్వ ఇలాగే కొనసాగితే పిల్లలు బడికి రావడానికి భయపడుతున్నారని ఇలాగైతే పిల్లల చదువు ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై స్థానిక ఎంఈఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా పాఠశాల లో ఇప్పటికే అమ్మ బడి కార్యక్రమంలో మెంటనెన్స్ పనులు చేయడం జరిగిందని,వర్షపు నీరు వెళ్ళడానికి శాశ్వత ప్రతి ప్రాతిపదికన పనులు చేపడతామని అన్నారు.

Tags:    

Similar News