రైతుల సంక్షేమమే లక్ష్యం
రైతు సంక్షేమమే తమ లక్ష్యమని, ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.
దిశ,మల్యాల : రైతు సంక్షేమమే తమ లక్ష్యమని, ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మంగళవారం మల్యాల మండలంలోని రామన్నపేట, ముత్యంపేట, మల్యాల, తాటిపల్లి, బల్వంతాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2320, బి గ్రేడ్ కు రూ. 2300 ప్రభుత్వం రైతులకు అందిస్తుందని అన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారుల మాటలు విని మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి ,తహసీల్దార్ మునీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగ ఆనంద రెడ్డి, నేరెళ్ల సతీష్ రెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, తిరుపతి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.