Saudi Arabia:సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి

సౌదీ అరేబియా ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు మహ్మద్ షాజాద్ ఖాన్ ద‌య‌నీయ‌స్థితిలో చనిపోయాడు.

Update: 2024-08-24 06:41 GMT

దిశ, బ్యూరో కరీంనగర్:సౌదీ అరేబియా ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు మహ్మద్ షాజాద్ ఖాన్ ద‌య‌నీయ‌స్థితిలో చనిపోయాడు. కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) మహ్మద్ షాజాద్ ఖాన్ సౌదీలో ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ అత‌డు ఐదు రోజుల కింద‌ట త‌న తోటి ఉద్యోగితో క‌లిసి ఓ చోటుకు వెళ్లారు. జీపీఎస్ పనిచేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఉపాధి కోసం షాజాద్ ఖాన్ మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన‌ట్లు స‌మాచారం. అక్క‌డి ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ట‌వ‌ర్ టెక్నీషియ‌న్‌గా పనిచేస్తున్నాడు. షాజాద్ మృతితో అత‌ని స్వ‌స్థ‌లంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు విలపిస్తున్నారు.


Similar News