నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్రీడలు : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం కప్-2023 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
దిశ, జమ్మికుంట : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం కప్-2023 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కప్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు. మూడు రోజుల పాటు కబడ్డీ, ఫుట్ బాల్, వాలీబాల్, ఖోఖో క్రీడలతో పాటు అథ్లెటిక్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డ మమతా ప్రసాద్, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యాం, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.