దారుణం.. 400 మంది విద్యార్థినీలున్న హాస్టల్‌లో నాలుగే వాష్ రూమ్స్
డ్రైనేజ్ వాటర్ లీక్ కావడంతో దుర్గంధం వెదజల్లి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. పట్టణంలోని...Special Story of Hostel
దిశ, హుజూరాబాద్: డ్రైనేజ్ వాటర్ లీక్ కావడంతో దుర్గంధం వెదజల్లి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాలేజీ బాలికల హాస్టల్ వద్ద డ్రైనేజ్ లీక్ అయి మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో విద్యార్థినీలు పడరాని పాట్లు పడుతున్నారు. 400 మందికి పైగా ఉంటున్న ఈ హాస్టల్ లో నాలుగే వాష్ రూమ్ లు ఉండటంతో మూడు రోజులకొకసారి స్నానం చేస్తున్నారని పలువురు విద్యార్థుల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజిటింగ్ డే కావడంతో హాస్టల్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ నెలకొన్న పరిస్థితిని చూసి మనోవేదనకు గురయ్యారు. అనంతరం తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా జామ్ అయిన వాష్ రూమ్ లను శుభ్రం చేసేందుకు స్కావెంజర్లు పిలిపించానని, అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని ప్రిన్సిపాల్ మంజుల వివరణ ఇచ్చారు. సౌకర్యాలలేమితో విద్యార్థినీలు పడుతున్న విషయాన్ని జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయానని, వేరె భవనంలోకి హాస్టల్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా హాస్టల్ తరలింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.