ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యను బోధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లిలోని ప్రగతి నగర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2023-07-31 11:48 GMT

దిశ, పెద్దపెల్లి కలెక్టరేట్ : పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యను బోధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లిలోని ప్రగతి నగర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాఠ్యాంశాలకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగి విద్యార్థుల విషయ పరిజ్ఞానం, చదివే, రాసే సామర్ధ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.

పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు, చదివే, రాసే సామర్థ్యం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ తక్కువ అటెండెన్స్ ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు రెగ్యులర్ గా వచ్చేలా కృషి చేయాలన్నారు. హాజరు శాతం మెరుగుపరిచే విధంగా అవగాహన కల్పించాలని, పాఠశాలలో నిబంధన ప్రకారం పేరెంట్, టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ రూంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిరోజు విద్యార్థులు కనీసం గంట సమయం గ్రంథాలయంలో గడపాలని, విద్యార్థులు చదవడం అలవర్చుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.రమాదేవి, టీచర్స్ అనిత, రమ్య, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News