మానసిక వికలాంగులకు సేవ చేయడం వరం..: మంత్రి సీతక్క

మానసిక వికలాంగులకు సేవ చేయడం వరంలాంటిదని,

Update: 2024-09-30 14:01 GMT

దిశ, తిమ్మాపూర్ : మానసిక వికలాంగులకు సేవ చేయడం వరంలాంటిదని, మానసిక వికలాంగుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ లోని మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల పాఠశాల నడుస్తుండడం హర్షనీయమని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా బుద్దులతో పాటు వృత్తి నైపుణ్యం నేర్పించడం గొప్ప విషయమని అన్నారు.

ఫిజియో థెరపీ , మానసిక అంశాల పై వారికి మంచి శిక్షణ ఇవ్వడం హర్షనీయం అని పేర్కొన్నారు. స్కూల్ కి బస్సు ఏర్పాటు చేస్తామని, అది ప్రభుత్వం ద్వారా నిర్వహణ జరిగేలా చూస్తామని అన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం , కూర్చోవడానికి బెంచేస్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలోని పిల్లలకు శారీరక దృఢత్వం కూడా పెంచాలని కోరారు. అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.


Similar News