సమాజహితులు పాత్రికేయులు : ఎమ్మెల్యే కోరుకంటి
సమాజహితులు పాత్రికేయులు గోదావరిఖని ప్రెస్ క్లబ్ నిర్మాణానికి పూర్తి
దిశ,గోదావరిఖని : సమాజహితులు పాత్రికేయులు అని గోదావరిఖని ప్రెస్ క్లబ్ నిర్మాణానికి పూర్తి సహాకారం అందించామని, రామగుండం నియోజకవర్గం జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్దలాలు మాంజూరు అయ్యెాలా కృషి చెస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమ కారులకు ఉద్యమానికి తమకు అండగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ నిలిచిందన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ భవనం మా హాయంలో జరిగిందటే అదొక చరిత్ర అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
పాత్రికేయులు రేపటి కాలంలో పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వం ద్వారా మా ద్వారా పధకాల్లో తగిన ప్రాధాన్యత అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా పాత్రికేయులు పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్ మరో 30 లక్షల రూపాయలు నిధులను అందిస్తామని చెప్పారు. రామగుండం నియోజకవర్గం పాత్రికేయులకు ఇండ్ల స్దలాలు అతి త్వరలో అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వంశీ ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్ కోశాధికారి దయానంద్ గాంధీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు జడ్పిటిసి ఆముల నారాయణ నాయకులు కౌశిక హరి ఇంజపూర్ పులిందర్ తో పాటు సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.