‘రైతు బీమా’ రూల్స్ ‘గీత బీమా’కు వర్తింపజేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబీమా పథకంలోని నిబంధనలను గీతా బీమాకు వర్తింపజేసి గీత వృత్తి కార్మికులను ఆదుకోవాలని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-06-15 08:30 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబీమా పథకంలోని నిబంధనలను గీతా బీమాకు వర్తింపజేసి గీత వృత్తి కార్మికులను ఆదుకోవాలని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల, మోతె, తిమ్మాపూర్ గ్రామాల గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రమాదవశాత్తు చనిపోయిన లేక అకాలమరణం చెందిన రైతుబీమా ఇస్తున్నారని తెలిపారు. అయితే గీతా బంధు ద్వారా కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితెనే బీమా ఇస్తున్నారని కాబట్టి పథకంలోని నిబంధనలు సడలించి గీతా కార్మికులు ఎలా మరణించిన బీమా వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు.

ఊరురా బెల్ట్ షాపులతో గీతకార్మికుల ఉపాధికి గండి కొడుతున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. కులవృత్తుల ప్రోత్సాహకం కింద ఇస్తామన్న లక్ష రూపాయలు గీత కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని గీత వృత్తి కులవృత్తి కాదా అని ప్రశ్నించారు. గౌడ సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా గీతకార్మికులు కోరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల గౌడ సంఘం అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షుడు కాసారం భాస్కర్, మోతే గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమల్ల రామకృష్ణ గౌడ్, తిమ్మాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు కాసారపు కిషన్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొల్లపల్లి ప్రసాద్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News