ఎమ్మెల్యేలు పాలాభిషేకాలకే పరిమితం.. కాంగ్రెస్ నేత ఫైర్

దిశ, గోదావరిఖని: రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కేవలం పాలాభిషేకాలకే పరిమితం అ

Update: 2022-03-20 09:09 GMT

దిశ, గోదావరిఖని: రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కేవలం పాలాభిషేకాలకే పరిమితం అయ్యారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ విమర్శించారు. ఈ సందర్భంగా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామగుండంలోని బీపిల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రైతుల వద్ద నుండి భూములు సేకరించి ఇప్పటికి అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసెంబ్లీలోని జీరో అవర్ లో పవర్ ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. ఇప్పటి వరకు రామగుండం కార్పొరేషన్ కు సొంతగా ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని గత ప్రభుత్వాల హయాంలో వచ్చిన నిధులతోనే పనులు జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ఫ్రక్రురుద్దీన్, నగునూరి రాజు, పెద్దలే ప్రకాష్, ముస్తఫా, గాదం విజయ, పెండ్యాల మహేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News