రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు

మండలంలో రైతులు ధాన్యంను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు.

Update: 2024-10-19 10:42 GMT

దిశ, గంగాధర : మండలంలో రైతులు ధాన్యంను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. శనివారం గంగాధర మండల కేంద్రంతో పాటు గట్టుభుత్కూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రతి రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అనుపమ, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, తిరుమల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News