Minister Ponnam Prabhakar : కేంద్ర మంత్రి బండిపై పొన్నం ప్రభాకర్ ఫైర్..
తెలంగాణలో అమలవుతున్న రైతు రుణమాఫీ పథకం పై కేంద్ర
దిశ,కరీంనగర్ రూరల్: తెలంగాణలో అమలవుతున్న రైతు రుణమాఫీ పథకం పై కేంద్ర మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.శుక్రవారం బొమ్మకల్ బైపాస్ లోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కరీంనగర్ జిల్లా స్థాయి రైతు అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తక్షణమే బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇంత పెద్ద రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
తొలివిడతగా లక్ష లోపు ఉన్న రుణాలను గురువారం జులై 18న మాఫీ చేశామని, త్వరలోనే లక్షన్నర వరకు, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని,అది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కానీ.. కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదంటున్న బండి సంజయ్, అది నిరూపించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటే దాన్ని భరించలేకనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ , ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,,ఎమ్మెల్యేలు, కవ్వంపల్లి సత్యనారాయణ ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ఎంపీ గడ్డం వంశీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు భారీగా హాజరయ్యారు.