నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్...

నాటు బాంబులను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి నిందితుల నుంచి నాటు బాంబుల తయారీకి సంబంధించిన ముడి సరుకులను స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2024-09-22 12:47 GMT

దిశ, కోనరావుపేట ; నాటు బాంబులను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి నిందితుల నుంచి నాటు బాంబుల తయారీకి సంబంధించిన ముడి సరుకులను స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే. మల్లయ్య కు చెందిన గేదె గత రెండు రోజుల క్రితం గ్రామ శివారులో గడ్డి మేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలి, గేదె దవడ భాగానికి తీవ్ర గాయం అయింది. ఈ ఘటనలో గాయపడిన గేదె యజమాని ముడికే. మల్లేశం కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్,ఎక్స్ ప్లోజివ్ చట్టాల ప్రకారంగా ఏఎస్ఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేశారు.

గతంలో నాటు బాంబుల కేసులో అరెస్టు ఐనా నిందితుల పై నిఘా ఉంచగా, ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన పిట్టల రాజలింగం అనే వ్యక్తి గ్రామంలో నాటు బాంబులు,వేరే వ్యక్తులకు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఏఎస్ఐ రఘుపతి రెడ్డి సిబ్బందితో రాజలింగం ఇంటికి ఎటాక్ చేశారు. పిట్టల రాజలింగం నాటు బాంబులు తయారు చేసి చిన్న బోనాల గ్రామానికి చెందిన పడిగే లాస్మయ్య, తుమ్మల కనకరాజులు అనే వ్యక్తులకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, నాటు బాంబుల తయారీకి సంబంధించిన ముడి సరుకులను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… అటవీ జంతువులను వేటాడి చంపి,ఆ మాంసాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి చట్టవ్యతిరేకమైన నాటు బాంబులను తయారు చేస్తున్నారని తెలిపారు. ఒక మూగ జీవి మరణానికి కారణమైన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని అన్నారు.

ధర్మారం గ్రామానికి చెందిన 1) పిట్టల రాజలింగం నుండి 7 నాటు బాంబులు, గన్ పౌడర్ తయారీకి ఉపయోగించే రెండు పౌడర్ ప్యాకెట్స్ , 2000 రూపాయల నగదు. 2)చిన్న బోనాల గ్రామానికి పడిగే లస్మయ్య దగ్గర 10 నాటు బాంబులు,తుమ్మల కనకరాజు దగ్గర 10 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే సిరిసిల్ల పోలీస్ వారు నమ్మదగిన సమాచారం మేరకు సర్ధాపూర్ గ్రామానికి చెందిన మొగిలి అంజయ్య ఇంట్లో రైడ్ చేయగా 40 నాటు బాంబులు స్వాధీనం చేసుకొని,నిందితుడిని విచారించగా నిందితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవి జంతువులను వేటాడని కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో నాటు బాంబుకి పిండి పూసి అటవీ జంతువులకు ఎరగా వేయగా గేదె కొరకడంతో దవడ పగిలిపోయిందని నేరం అంగీకరించాడు అని తెలిపారు.

ఈ నిందితులు గత కొన్ని నెలలుగా అటవీ జంతువులు చంపడానికి నాటు బాంబులు ఉపయోగిస్తూ మూగ జీవులకు హాని కలిగిస్తున్నారు అని, అలాగే ఊరిలో ఉండే జీవులను చంపి మాంసం కుప్పలను అటవీ జంతువుల మాంసంగా చెప్తూ గ్రామాల్లో అమ్ముకుంటూ ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు అని తెలిపారు. నిందితులను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన రుద్రంగి ఎస్ఐ అశోక్, కిరణ్ కుమార్, కోనరావుపేట ఏఎస్ఐ రఘుపతి రెడ్డి, కానిస్టేబుల్ విశాల్, జగన్, ఇమ్రాన్, రాజు, రవి, సతీష్, అభిషేక్, ఒదెల్, సిబ్బందిని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు.


Similar News