Jeevan Reddy : కుల సంఘాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

కుల సంఘాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ

Update: 2024-09-22 15:08 GMT

దిశ, జగిత్యాల టౌన్ : కుల సంఘాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన రెడ్డి జన సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గర్ల్స్ హాస్టల్ ఏర్పాటుకు తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

అనంతరం కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్తులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని విద్యాపరంగా, ఉద్యోగ పరంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందజేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. తర్వాత నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కొప్పెర వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టంపేట రామచంద్రారెడ్డి, కోశాధికారి నేరెళ్ల భూమారెడ్డి తో పాటు కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , వైద్యులు శైలేందర్ రెడ్డి,సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News