Korukanti Chander : లాభాల వాటా చెల్లింపులో అన్యాయం..

సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట

Update: 2024-09-22 12:45 GMT

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కారు సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకుందని మండిపడ్డారు. 2023-24 సంవత్సరానికి సింగరేణి సంస్థకు 24,701 కోట్ల నికర లాభం వస్తే అందులో కేవలం ₹796 కోట్లు కార్మికులకు ఇచ్చి 33 శాతం ఇచ్చామని అబద్దాలు చెబుతోందని విమర్శించారు.

సింగరేణి సంస్థ 2022-23 వార్షిక సంవత్సరంలో 72,222 కోట్ల లాభాలను ఆర్జించిందని చెప్పారు. అదే 2023-24 వార్షిక సంవత్సరానికి 74,701 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొన్నదని, అందులో కార్మికులకు 33 శాతం వాటా అంటే ₹1,550 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ కేవలం 796 కోట్లు మాత్రమే ఇవ్వడం ఎమిటని ప్రశ్నించారు. ప్రతి కార్మి కుడికి లాభాల్లో వాటా కింద ₹4లక్షలు రావాల్సి ఉం దని, కానీ ప్రభుత్వం చేసిన మోసానికి ఒక్కొక్కరికి రూ. 2లక్షల లాభాలు తగ్గించబడ్డాయని ఆరోపించారు. గత 15 ఏళ్లలో ఈసారే అత్యంత తక్కువ మొత్తంలో (కేవలం 16.9%) లాభాలు కార్మికులకు అందాయని తెలిపారు.

2023-2024 వచ్చిన లాభాలు - రూ. 4,701 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా రూ. 796 కోట్లని, వాటా 16.90 శాతం , 2022-23 వచ్చిన లాభాలు - రూ. 2,222 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 700 కోట్లు వాటా 32 శాతం, 2021-2022వచ్చిన లాభాలు 1227 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 368 కోట్ల వాటా 30 శాతం, 2020-21 వచ్చిన లాభాలు 272.64 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 79.07 కోట్లు వాటా 29శాతం, 2019-20 వచ్చిన లాభాలు - రూ. 993 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 278 కోట్ల వాటా 28 శాతం, 2018-19 వచ్చిన లాభాలు 1765 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 494 కోట్ల వాటా 28 శాతం, 2017-18 వచ్చిన లాభాలు - రూ. 1212 కోట్లు కార్మికులకు పంచిన వాటా 327 కోట్లు కాగా వాటా 27 శాతం 2016-17వచ్చిన లాభాలు - రూ. 395 కోట్లు కాగా కార్మికులకు పంచిన వాటా 99 కోట్లు వాటా శాతం - 25 % 2015-16 వచ్చిన లాభాలు - రూ. 1066 కోట్లు కార్మికులకు పంచిన వాటా 245 కోట్లు వాటా 23 శాతం 2014-15 వచ్చిన లాభాలు - రూ. 490 కోట్ల ని కార్మికులకు పంచిన వాటా 103 కోట్లు వాటా 21 శాతం మని పెర్కోన్నారు. ప్రభుత్వ మోసంతో ఒక్కో కార్మికుడికి రూ.2లక్షల మోసం జరుగుతుందని కార్మికులకు న్యాయం గా రావాల్సిన ₹1,550 కోట్ల లాభాలను పంచాలని డిమాండ్ చేశారు.


Similar News