Choppadandi MLA : సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

గంగాధర మండల కేంద్రంలో కరీంనగర్ సహకార అర్బన్

Update: 2024-09-22 10:46 GMT

దిశ, గంగాధర: గంగాధర మండల కేంద్రంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు శాఖను కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారంప్రారంభించారు. సహకార బ్యాంకుల వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు, చిరు వ్యాపారులు, స్థానిక ప్రజలు సహకార బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించే సహకార బ్యాంకు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గ్రామాలకు సహకార బ్యాంకు సేవలను విస్తరించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో రెండవ బ్రాంచ్ గా గంగాధరలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సేవలు అందించనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, బ్యాంకు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, సీఈవో నునుగొండ శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు తదితరులు.


Similar News