శివాలయంలో పాలు తాగుతున్న నంది విగ్రహం
దిశ, రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామంలోనీ శివాలయంలో మంగళవారం అరుదైన
దిశ, రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామంలోనీ శివాలయంలో మంగళవారం అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శివాలయానికి వెళ్లిన భక్తులు శివుని దర్శనం చేసుకుని అనంతరం నంది విగ్రహానికి పాలు పోస్తుండగా.. పాలు తాగుతున్న సంఘటన చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా నంది విగ్రహం పాలు తాగడం చూసి గ్రామంలోని గ్రామస్తులు ఈ అరుదైన సంఘటనను చూడటానికి తండోప తండాలుగా వస్తున్నారు. ఇది జమేనా అని అక్కడికి వెళ్ళిన ఉపసర్పంచ్ స్వయానా నంది విగ్రహానికి పాలు పోస్తూ ఉంటే విగ్రహం పాలు తాగడం చూసి అవాక్కయ్యారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఈ శివాలయంలో సాక్షాత్తు పరమ శివుడే వచ్చి పాలు తాగుతున్నాడని గ్రామస్తులు తెలుపుతున్నారు.