ఆ ప్రాజెక్ట్ తెగిపోవడడానికి మంత్రి బాధ్యతరహిత్యమే కారణం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
బీర్పూర్ మండలంలోని రోల్ల వాగు ప్రాజెక్టును స్థానిక రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు.
దిశ, బీర్పూర్: బీర్పూర్ మండలంలోని రోల్ల వాగు ప్రాజెక్టును స్థానిక రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. తూమును పరిశీలించి.. ప్రాజెక్టుకు ఎన్ని ఫీట్ల మీద నీరు ఉంటుంది.. ఏ మేరకు నిల్వ చేస్తే చర్లపల్లికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. తూముకు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్ల వాగు ప్రాజెక్టును కాంగ్రెస్ పాలనలో రాజుల చెరువును 0.25 టీఎంసీ ఎస్సారెస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా రూపొందించమని గుర్తు చేశారు. బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఆధునీకరణ పేరుతో రూ.60 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును మంత్రి బాధ్యతరాహిత్యం వల్ల.. ఐదేళ్లు గడుస్తున్న పూర్తిగాకపోవడంతో అంచనా వ్యయం రూ.130 కోట్లకు పెంచారని అన్నారు.
మంత్రి బాధ్యరహిత్యం వల్ల రోల్ల వాగు ప్రాజెక్టు తెగిపోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద కొట్టుకుపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. రోల్ల వాగు పనులు నాణ్యతగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై భారం వేస్తూ ఏసీడీ విద్యుత్ చార్జీలు వేయడాన్ని నిరసిస్తూ.. వ్యవసాయానికి నిర్దిష్టమైన సమయంలో కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 31న జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టే ధర్నాకు రైతులు, విద్యుత్ వినియోగదారులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఎంపీపీ మాసర్తి రమేష్, జెడ్పీటీసీ పాత పద్మ రమేష్, బల్మూరి లక్ష్మణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెరుపురి సుభాష్ ,ఎంపీటీసీలు రంగు లక్ష్మణ్, ఆడెపు మల్లేశ్వరి తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ నవీన్ రావ్, జితేందర్, జోగి రెడ్డి, తోట శ్రీనివాస్, బర్రె రాజన, శంకర్ అఖిల్, అభిలాష్ పాల్గొన్నారు.