అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల శివారులోని నూకపల్లి లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన అందరికీ అందజేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2023-01-06 13:48 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల శివారులోని నూకపల్లి లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన అందరికీ అందజేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో 5,600 మంది డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరాఖాస్తూ చేసుకోగా.. 3,459మందిని అర్హులుగా గుర్తించారని 4,500 ఇండ్లు అందుబాటులో ఉంటే అర్హులకు లాటరీ పద్ధతిన డ్రా తీయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్హులకు సరిపడా ఇండ్లు అందుబాటులో ఉన్నా లాటరీ తీస్తూ.. లబ్ధిదారులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ హయాంలో అర్హత ప్రాతిపదికన ఇళ్లు కేటాయించామని తెలిపారు.

గతంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన 4,000 ఇళ్లలో 1,676 ఇళ్లు వివిధ నిర్మాణాల్లో నిలిచిపోగా.. 2,324 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాలేదని అయితే 2018లో అప్పటి మంత్రి కేటీఆర్ జగిత్యాల అర్బన్ ప్రజల కోసం నూకపల్లి లో 4,500 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, వీటిలో 2,324మందికి డబుల్ బెడ్రూం ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివిధ దశలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఒక్కో ఇంటికి మూడు లక్షల చొప్పున 50 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో నెలకొన్న ఆందోళనలు తొలగించేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని మిగిలిన ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించాలని అవసరమైతే లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News