Breaking News... ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్‌పై చెప్పులతో దాడి (వీడియో)
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి నుండి గన్నేరువరం, పొత్తూరు వరకు....MLA Rasamai's convoy attacked with sandals
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి నుండి గన్నేరువరం, పొత్తూరు వరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టాలని యువజన సంఘాల నాయకులు మండల ప్రజలు దాదాపు 400 మందితో నిర్వహించిన మహా ధర్నాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మహా ధర్నా జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బెజ్జంకి పర్యటనకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ పై ఒక్కసారిగా చెప్పులు, రాళ్లు విసిరి నిరసన తెలిపినట్లు సమాచారం. అక్కడే ఉన్న పోలీసులు ధర్నా చేస్తున్నవారిపై లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.