గ్రామీణ రోడ్లకు మహర్దశ: మంత్రి కొప్పుల

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల... Minister Koppula Speech

Update: 2023-02-25 12:38 GMT

దిశ, పెగడపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కోసమై మండలంలో పర్యటించిన మంత్రి ముందుగా మండలం కేంద్రం నుండి మల్యాల మండల కేంద్రానికి వెళ్ళే రహదారి విస్తరణ కోసం నిధులు మంజూరు అవ్వగా అట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నరసింహునిపేట గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించే నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతర వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతి మండల కేంద్రం నుండి మరొక మండల కేంద్రానికి రెండు వరుసల రహదారి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నామని, తద్వారా మండలాల మధ్య గల గ్రామాల్లో రహదారులకు మహర్దశ వచ్చిందని అన్నారు. అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంప్ యార్డులు నిర్మించుకుని గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతతో వెళ్లివిరిస్తున్నయని పేర్కొన్నారు. ఇక మీదట పంచాయతీలకు వచ్చే నిధులు నేరుగా పంచాయితీ ఖాతాలోనే వేసే విధంగా బడ్జెట్ లో తెలిపామని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి రమణ రావు, సర్పంచులు మెరుగు శ్రీనివాస్, బాబు స్వామి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ లోక నిర్మల మల్లారెడ్డి, వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, డైరెక్టర్ మడిగెల తిరుపతి, నాయకులు గోలి సురేందర్ రెడ్డి, రాజ శేఖర్ గౌడ్, షేక్ హైదర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News