హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష..
మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన కరేంగుల శ్రీనివాస్ జిల్లా కోర్టులో యావజీవ కారాగార శిక్ష విధిస్తూ అలాగే వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
దిశ, కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన కరేంగుల శ్రీనివాస్ జిల్లా కోర్టులో యావజీవ కారాగార శిక్ష విధిస్తూ అలాగే వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఎస్ఐ రాజవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. 01 మార్చి 2021న కారంగుల రమేష్ తన తల్లి అయినా కరేంగుల మల్లమ్మను తన బాబాయి కొడుకు కరేంగుల శ్రీనివాస్ భూమి తగాదాలు మనసులో పెట్టుకొని ఇనుపరాడ్ తో చంపాలని ఉద్దేశంతో కొట్టాడని దరఖాస్తు మేరకు అప్పటి ఎస్ఐ అప్పని వెంకటేశ్వర్లు కేసు నమోదు చేయగా, కొద్దీ రోజుల తరువాత కరేంగుల మల్లమ్మ చికిత్స పొందుతూ మరణించింది.
సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేన రెడ్డి పరిశోధన ప్రారంభించి విచారణ చేసి నేరస్తుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించామని, పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయగా,పెద్దపెల్లి జిల్లా కోర్టు కోర్టులో కేసు విచారణలో జడ్జి శ్రీ ఎం నాగరాజు ఇరువురి వాదనలు విని తదనంతరం బుధవారం నేరస్తుడు నేరం చేసినట్లు రుజువైనందున యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1000లు జరిమానా విధించారని ఎస్ఐ తెలిపారు. నేరస్తునికి శిక్ష పడడానికి సాక్షులను ప్రవేశపెట్టి నేరాన్ని రుజువు చేయడంలో పబ్లిక్ లాయర్, పోలీస్ ఉన్నత అధికారులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.