రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు రెగ్యులర్​ చేయాలి

ఎలాంటి రాత పరీక్ష లేకుండా తమ ఉద్యోగాలను రెగ్యులర్​ చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.

Update: 2024-12-21 09:04 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : ఎలాంటి రాత పరీక్ష లేకుండా తమ ఉద్యోగాలను రెగ్యులర్​ చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఫిమేల్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

    ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఏఎన్ఎమ్ లు చేపట్టిన ఆందోళన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకొని ఏఎన్ఎంలకు నచ్చచెప్పారు. ఆందోళన విరమింపజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 


Similar News