Akbaruddin Owaisi : అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) పై ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) పై ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తమ పార్టీ పూర్తి మద్ధతు తెలుపుతోందని ప్రకటించారు. వారి హీరోయిజాన్ని చూపించుకునేందుకు సామాన్య ప్రజల జీవితాలతో నటులు ఆటలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఘటన జరిగిన రోజు ఓ మహిళ చనిపోయిందని చెబితే.. అయితే మన సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్ అన్నారట, ప్రపంచంలో ఇంత దుర్మార్గపు మనుషులు ఉంటారా అని ప్రశ్నించారు. అయితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater Incident)పై ఫైర్ అయ్యారు. హీరో అల్లు అర్జున్ ఒక్క రోజు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లినందుకు.. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన్ను పరామర్శించిందని, కానీ తొక్కిసలాటలో గాయపడిన బాలుడుని పరామర్శించేందుకు ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రాలేదని మండిపడ్డారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని, ఇక తెలంగాణలో టికెట్ల ధరల పెంపు ఉండదని.. ప్రీమియర్, బెన్ ఫిట్ షోలకు తాను అధికారంలో ఉన్నంతకాలం ఉండదని తేల్చి చెప్పారు.