విద్యుదాఘాతంతో 15 జీవాలు మృతి

జూలపల్లి మండలం చీమల పేట గ్రామానికి చెందిన తొంటి ఎల్లయ్యకు చెందిన 15 జీవాలు విద్యుదాఘాతంతో మరణించాయి

Update: 2024-12-21 13:43 GMT

దిశ, జూలపల్లి : జూలపల్లి మండలం చీమల పేట గ్రామానికి చెందిన తొంటి ఎల్లయ్యకు చెందిన 15 జీవాలు విద్యుదాఘాతంతో మరణించాయి. ఈయన ఇంటి ముందు గొర్లను ఉంచగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగి మంటలు చెలరేగడంతో 15 జీవాలు మృతి చెందాయి.

    కాగా గొర్ల కాపరిని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పరామర్శించారు. ప్రభుత్వం బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లంక తిరుపతి, తొంటి రాజేశం, రాణవేణి సంపత్, కల్వల రాజేశం, లంక భూమయ్య, తొంటి బీరయ్య, తొంటి మల్లేశం, మొగుల్ల ఐలయ్య, పుల్ల రాకేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.


Similar News