ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-12-21 10:04 GMT

దిశ, గోదావరిఖని : ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్లో అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆర్గనైజేషన్ వాలెంటీర్స్ రామ్ మోహన్ బండా, ఓం ప్రకాష్ నిర్వహించిన మెడిటేషన్ లో పాల్గొన్నారు. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు.

    యోగా ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక, భౌతిక అభ్యాసమన్నారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐ లు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఎస్ఐ అనిల్, ఓం ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News