అభివృద్ధి పేరుతో రోడ్డున పడేశారు

అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల జీవితాలను రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.

Update: 2024-12-21 09:35 GMT

దిశ, గోదావరిఖని : అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల జీవితాలను రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక ఓల్డ్ అశోక్ టాకీస్ సమీపంలో కుల్చివేతకు గురైన చిరువ్యాపారులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా కుల్చడం దారుణం అన్నారు. ఎమ్మెల్యేగా మాక్కాన్ సింగ్ గెలిచిన తర్వాత ఓల్ఢ్ అశోక్ థియేటర్ కుల్చివేశారన్నారు. లీజుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆస్తులను కూల్చడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మూల విజయ రెడ్డి, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, వేముల అశోక్ పాల్గొన్నారు. 


Similar News