Jagtial Collector : ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ

ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు

Update: 2024-09-09 14:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు అని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు అని కొనియాడారు.

తెలుగు భాష పట్ల ప్రజాకవికి ఎనలేని మమకారం ఉండేదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News