Huzurabad: సీఎంఆర్ చెల్లింపునకు గడువు పెంపు.. మిల్లర్లకు వెసులుబాటు
డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని సీఎంఆర్ బియ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి.
రైస్ మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ చెల్లించేందుకు మరో మూడు నెలలు గడువు పెంచింది. దీంతో డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని సీఎంఆర్ ఇవ్వడానికి సిద్దంగా ఉండగా డిఫాల్ట్ మిల్లులకు సీఎంఆర్ పెట్టడానికి గడువు పెంచుతూ వెసులుబాటు కల్పించారు. దీంతో పాత బకాయిలు చెల్లించడానికి డిఫాల్ట్ మిల్లర్లు నానా తిప్పలు పడుతున్నారు. డిఫాల్ట్ మిల్లులు 2021-22 సంవత్సరం నుంచి తీసుకున్న ధాన్యానికి బియ్యం ఇవ్వని మిల్లులకు ఈసారి ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వాలంటే 100శాతం బ్యాంక్ గ్యారెంటీతోపాటుగా 25శాతం ఫెనాల్టీ చెల్లించాలని నిబంధనలు విధించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు కఠినంగా ఉండడంతో చాలామంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. హుజూరాబాద్‌లో 40 మిల్లులు ఉండగా కేవలం 8మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించారు. మిగతా వారికి ఫెనాల్టీ చెల్లిస్తే ధాన్యం తీసుకునే వీలున్నా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాల్లో లేవు. వీరికి ప్రభుత్వం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందనేది వేచి చూడాలి. కాగా, గతంలో 2021-22 నుంచి బకాయిలు ఉన్న మిల్లర్లకు ఫెనాల్టీతో బియ్యం ఇవ్వడానికి మరో మూడు నెలలు గడువు ఇవ్వడంతో ఈ సీజన్‌లో తీసుకున్న ధాన్యంతో గత బకాయిలు చెల్లించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
దిశ, హుజూరాబాద్ : డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని సీఎంఆర్ బియ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. కాగా, డిఫాల్ట్ అయిన మిల్లులు సీఎంఆర్ పెట్టడానికి మరో మూడు నెలలు గడువు ఇచ్చారు. దీంతో పాత బకాయిలు చెల్లించడానికి డిఫాల్ట్ అయిన మిల్లర్లు నానా తిప్పలు పడుతున్నారు. డిఫాల్ట్ మిల్లులు 2021-22 సంవత్సరం నుంచి తీసుకున్న ధాన్యానికి గాను బియ్యం ఇవ్వని మిల్లులకు ఈసారి ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వాలంటే 100శాతం బ్యాంక్ గ్యారెంటీతోపాటుగా 25శాతం ఫెనాల్టీ చెల్లించాలని నిబంధనలు విధించారు. దీంతో చాలామంది మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ, ఫెనాల్టీ చెల్లించకపోవడంతో కొంత మందికే ధాన్యం కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల టన్నుల బియ్యం టార్గెట్ పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం 20లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఈ సమయం వరకు మిల్లుల ముందు క్యూ లైన్‌లో రద్దీగా ఉండే మిల్లులు ఈసారి ప్రభుత్వ నిబంధనల వల్ల రద్దీ లేకుండా మిల్లులకు ధాన్యం చేరుకుంది. ప్రభుత్వ నిబంధనలు రూపొందించే సరికే మార్కెట్ నుంచి ధాన్యం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. ఎక్కువగా పచ్చి ధాన్యం బయటి జిల్లాలకు వెళ్లింది. దీంతో ఇక్కడి మిల్లర్లకు ఈసారి ధాన్యం కరువు ఏర్పడే పరిస్థితి వచ్చింది. కాగా, ధాన్యం కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలు అంతగా లేక పోవడంతో మిల్లర్లు పొరుగు జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సీఎంఆర్ పెట్టేందుకు మూడు నెలలు గడువు..
కాగా డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలు కఠినంగా ఉండడంతో చాలామంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆసక్తి చూపిన కొంత మంది మిల్లర్లు ఫెనాల్టీ, బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడంతో వారికి ధాన్యం కేటాయింపులు చేశారు. అయితే హుజూరాబాద్‌లో 40 మిల్లులు ఉండగా కేవలం 8మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించారు. మిగతా వారికి ఫెనాల్టీ చెల్లిస్తే ధాన్యం తీసుకునే వీలున్నా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాల్లో లేవు. వీరికి ప్రభుత్వం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందనేది వేచి చూడాలి. ఈ ఖరీఫ్ సీజన్ కాకుండా గతంలో 2021-22 నుంచి బకాయిలు ఉన్న మిల్లర్లకు ఫెనాల్టీతో బియ్యం ఇవ్వడానికి మరో మూడు నెలలు గడువు ఇచ్చారు. దీంతో మిల్లర్లు ఈ సీజన్‌లో తీసుకున్న ధాన్యంతో గత బకాయిలు చెల్లించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా బకాయిలు ఉన్న మిల్లర్లు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధాన కంపెనీలకు అప్పగించింది. కొంతమంది వీరికి ధాన్యం, డబ్బులు చెల్లించినా ధరల్లో వ్యత్యాసం రావడంతో వివాదం మొదలైంది. బిడ్డర్లు ప్రభుత్వం విధించిన ధర కన్నా ఎక్కువ వసూళ్లు చేస్తున్నారని సీఎం ముందు ఫిర్యాదు చేయగా ఎక్కువ ధర తీసుకోకూడదని తెలిపారు. మిల్లర్లు సకాలంలో చెల్లించకపోవడంతో తమకు వడ్డీ మీద పడుతుందని సదరు కంపెనీలు వాపోయాయి. దీంతో మిల్లర్ల బకాయిల వ్యవహారం పెండింగ్‌లో పడింది. ఇంతలో ఖరీఫ్ వచ్చి పోగా, రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ దశలో మిల్లర్లు ప్రభుత్వం నుంచి పాత బకాయిల కింద బియ్యం పెట్టడానికి అనుమతులు తెచ్చుకున్నారు. దీంతో మిల్లర్లకు మరో మూడు నెలల వెసులు బాటు దొరికింది. ఈ సమయంలో ప్రస్తుతం పెట్టిన ధాన్యంతో పాత బకాయిలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు.