రాబందు భూమేత కాంగ్రెస్ కావాలా, రైతుబంధు కావాలా : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు శకుని లా దాపరించాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-11-27 09:42 GMT

దిశ, పెద్దపల్లి, సుల్తానాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు శకుని లా దాపరించాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి ఈసీ అనుమతి ఇస్తే కాంగ్రెస్, బీజేపీలు కంప్లైంట్ చేసి రాకుండా చేశారని, రైతుబంధును ఆపిన దొంగలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్షన్ లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏం చేశాడని విమర్శిస్తున్న వారికి పథకాల గురించి చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయని అవి కనపడని సన్నాసులే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సుల్తానాబాద్ గడ్డమీద కోడండ్లకు శుభవార్త తెలుపుతున్నానని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కోడండ్లకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3016 అందిస్తామని అత్తలకు ఆసరా పెన్షన్ 5000 లకు పెంచుతామని ప్రకటించారు.

భూమి పుట్టినప్పుడు పుట్టిన కాంగ్రెస్ పార్టీ 11 సార్లు అధికారంలో ఉన్న మల్ల ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కోవడం ఇన్నేళ్లు వారు చేసిన అవినీతికి నిదర్శనమని అన్నారు. రైతుబంధు కావాలా భూ మేత కావాలా, పట్వారి దళారి వ్యవస్థలు కావాలో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావని పెద్దపల్లి జిల్లాను తెచ్చిన, సుల్తానాబాద్ పట్టణాన్ని మున్సిపాలిటీ చేసిన దాసరి మనోహర్ రెడ్డికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కృషి చేస్తామని, ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, పెద్దపల్లికి ఐటీ హబ్ ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News