నిరుపేదలపై కక్ష్య కట్టిన విద్యుత్ సిబ్బంది

ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్

Update: 2024-02-07 16:39 GMT

దిశ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలపై విద్యుత్ శాఖ సిబ్బంది కక్ష్య గట్టారు.వారిని డబుల్ రూమ్ ల నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశ్యంతో కరెంటు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన పడుతున్నారు.తప్పని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు. కావాలని నిరుపేదలకు ఇబ్బంది పెట్టేందుకే నాయకులు ఇలాంటి ఆగతానికి పాల్పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News