కొడుకు అన్నం పెడతలేరు సారు..ప్రజావాణిలో వృద్ధ దంపతుల ఫిర్యాదు
కొడుకు అన్నం పెడత లేడు సారు.. ఎలాగైనా మీరే న్యాయం
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : కొడుకు అన్నం పెడత లేడు సారు.. ఎలాగైనా మీరే న్యాయం చేయాలి అంటూ జగిత్యాల పట్టణంలోని గోవిందు పల్లెకు చెందిన వృద్ధ దంపతులు ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ముల్లె రాజవ్వ నారాయణ దంపతులు కలెక్టర్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. 57 గుంటల భూమిని కొడుకు తన పేరుపై మార్చుకుని ఇప్పుడు హింసిస్తున్నాడంటూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగోలేదని మందు గోలీలు అడిగితే ఎండ్రిన్ గోళీలు తెచ్చి ఇస్తా వేసుకోవాలన్నాడని తల్లి బోరున విలపించింది.