కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో ఈడీ తనిఖీలు..
కరీంనగర్ టౌన్ తెలంగాణలో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు కలకలం రేపుతున్నాయి.
దిశ, కరీంనగర్ : కరీంనగర్ టౌన్ తెలంగాణలో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి దాకా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలలు వాటి యాజమాన్యాల పై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ వైద్య కళాశాలలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఆఫీసు, ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఇంకా ఇతర కళాశాలల్లోనూ తనిఖీలకు అధికారులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వచ్చినా పొలిటికల్ హీట్ మాత్రం వేగంగానే వచ్చేసింది. ఎన్నికల సమయానికి మరో కొద్ది నెలలు సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు నేతలను ఆకర్షించడం.. చేర్చుకోవడం పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి.
ఇప్పటికే పలువురు వలస నేతలు ఏ గూటికి వెళ్లాలో తర్జనభర్జనపడుతుంటే వారిని ఆకర్షించే పనిలో పలురాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని హ్యాట్రిక్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తామే తెలంగాణ తీసుకొచ్చామని తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతోంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో కొద్దిగా ఢీలా పడిన హస్తం పార్టీ.. కర్ణాటక ఫలితాల అనంతరం ఒక్కసారిగా జోస్ పెంచింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలోకి వస్తున్నారు. ఖమ్మంలో పేరున్న నేతలు సైతం రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ మోడల్ అంటే ఎంటో చేసి నిరూపిస్తామని అంటున్నారు. దీంతో ప్రధాన పార్టీలు అన్ని తమ వ్యూహాలు పక్కగా అమలు చేస్తున్నాయి.
మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్.. అర్ధరాత్రి ఆస్పత్రికి.. ఈడీ పై డీఎంకే ఫైర్లైకా ప్రొడక్షన్స్పై ఈడీ నజర్.. మనీలాండరింగ్ కేసులో సోదాలు
రాష్ట్ర రాజకీయాల్లో దర్యాప్తు సంస్థల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పేరున్న రాజకీయ నాయకుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ పలుసంస్థలు దాడులు చేశాయి. దీంతో తమ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి బీజేపీ నేతలు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యహరిస్తాయని.. వాటి పని అవి చేసుకుంటాయని వివరణ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ దాడులు రానున్న ఎన్నికల్లో పలు మార్పులు తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో టాక్.