చిన్నారికి ఆపన్నహస్తం అందించరూ...

రెక్కాడితే డొక్కాడని కుటుంబం వారిది. ఆ పై తండ్రి వికలాంగుడు.

Update: 2024-09-05 15:20 GMT

దిశ,పెగడపల్లి : రెక్కాడితే డొక్కాడని కుటుంబం వారిది. ఆ పై తండ్రి వికలాంగుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమ కళ్ల ముందే ఆసుపత్రి లో వెంటిలేటర్ మీద ఉండటం తో నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. మండలంలోని రాంభద్రుని పల్లి గ్రామానికి చెందిన బొజ్జ మల్లేష్, లతల పెద్ద కూతురు బొజ్జ రిత్విక డెంగ్యూ జ్వరం మెదడుకు ఎక్కి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.

     అయితే వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న రిత్విక తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు సాయం చేసి తమ చిన్నారి ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయాలనుకుంటే 9177626310,8790286963 నంబర్లకు ఫోన్ పే ద్వారా సాయం చేయాలని వేడుకుంటున్నారు. 

Tags:    

Similar News