ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా పంచాయతీ అధికారి

గ్రామ పంచాయతీలలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 10 లోపు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పంచాయతీ శాఖ అధికారి వీర బుచ్చయ్య అన్నారు.

Update: 2024-10-06 09:17 GMT

దిశ, పెద్దపల్లి: గ్రామ పంచాయతీలలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 10 లోపు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పంచాయతీ శాఖ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం లోని అప్పన్న పేట ఎల్ అర్ ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ విజిట్ ను డిపివో వీర బుచ్చయ్య, డీఎల్పీవో వేణు గోపాల్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా డిపివో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించని దరఖాస్తులను షార్ట్ ఫాల్ పెట్టి రివర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలలో పన్ను వసూలు చేయాలని, నెలాఖరు వరకు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని, నెలాఖరు వరకు సేగ్రిగేషన్ షెడ్ల ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలన్నారు. పంచాయతీలలో వ్యాపారం నిర్వహించే వారు ట్రేడ్ లైసెన్సులు పొందేలా చూడాలని పేర్కొన్నారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీలత, సిబ్బంది ఉన్నారు.


Similar News