ప్రింట్, డిజిటల్ మీడియా రంగంలో దిశ ఒక బ్రాండ్..
ప్రతి నిమిషం.. ప్రజల సమస్యల కొరకే దిశ పత్రిక పని చేస్తుందని నేటి ప్రింట్, డిజిటల్ మీడియాలో రంగంలో అనతి కాలంలోనే దిశ ఒక బ్రాండ్ గా నిలిచిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
దిశ, మంథని : ప్రతి నిమిషం.. ప్రజల సమస్యల కొరకే దిశ పత్రిక పని చేస్తుందని నేటి ప్రింట్, డిజిటల్ మీడియాలో రంగంలో అనతి కాలంలోనే దిశ ఒక బ్రాండ్ గా నిలిచిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని నియోజకవర్గ కేంద్రం మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా " దిశ " 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పెద్దపల్లి జిల్లా స్టాఫర్ పుట్ట సతీష్, దిశ మంథని ఆర్సీ ఇంచార్జి మాదరబోయిన కిషన్ సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను, నిజాలను నిర్భయంగా వెలికితిస్తున్నదని అన్నారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి అధికారులకు చేర వేసే విధంగా పత్రికలు పని చేయాలి. ఈ విధంగా దిశ పత్రిక పని చేస్తుందని తెలిపారు. డిజిటల్ రంగంలో దిశ కథనాలు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వార్తలు చేరవేస్తూ ప్రజల హృదయాల్లో దిశ పత్రిక నిలిచిందని తెలిపారు. దిశ పత్రిక భవిష్యత్తులో మరింతగా ఉన్నత స్థానంలో ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, మంథని ఆర్డీఓ కె. సురేష్, మంథని తహశీల్దార్ రాజయ్య, మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ దేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ముత్తారం, రామగిరి దిశ రిపోర్టర్ లు బర్ల వెంకటేష్, అనుము వీరస్వామి, మున్సిపల్ కౌన్సిలర్ లు, అధికారులు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ అరెల్లి కిరణ్ గౌడ్, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.