BJP: ఎడ్యుకేషనల్ హబ్‌కు సహకరించండి.. కేంద్ర మంత్రికి బండి సంజయ్ వినతి
కరీంనగర్(Karimnagar) జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ(Technical University)ని స్థాపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) కోరారు.
దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్(Karimnagar) జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ(Technical University)ని స్థాపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) కోరారు. ఢిల్లీ(Delhi)లో కేంద్రమంత్రిని కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. కరీంనగర్ జిల్లాలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు టెక్నికల్ యూనివర్సిటీ వల్ల నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్య లభిస్తుందని వివరించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నర్సింహారావు(Former PM PV Narasimha Rao) స్వస్థలం వంగర (Vangara)లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు.
తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, అందులో హనుమకొండ జిల్లా ప్రస్తావన లేకపోగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చారని, మంత్రి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని వంగరల్‌లో, సిరిసిల్లలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అంతేగాక కరీంనగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కరీంనగర్ టౌన్ , కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మనకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, హుజూరాబాద్, వీనవంక, సైదాపూర్, జమ్మికుంట, ఎల్లందకుంట, శంకరపట్నం మండలాల్లో పీఎం శ్రీ కింద పాఠశాలలను ఏర్పాటు చెయ్యాలని అడిగారు.
ఇక పీఎం శ్రీ పథకం కింద కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 24 ప్రభుత్వ పాఠశాలలు, సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 16 పాఠశాలలకు ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు రూ.40 లక్షల చొప్పున నిధులు అందించాలని కోరారు. తాను చేసిన పలు అభ్యర్థనల పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్(Union Minister Dharmendra Pradhan) సానుకూలంగా స్పందించారని, ఈ ప్రతిపాధనలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని, ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ తెలిపారు.