స్వార్ధ రాజకీయాల కోసం గ్రామ విభజనవద్దు
స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాన్ని రెండుగా విభజించొద్దంటూ పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాన్ని రెండుగా విభజించొద్దంటూ పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. జీపీని రెండు పంచాయతీలుగా చేసే ప్రతిపాదనను తీవ్రంగా ఖండించిన ప్రజలు వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఎండ్లుగా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్న గ్రామాన్ని తమ రాజకీయ, కుటుంబ స్వార్థం కోసం విడదీయడం ఎంత వరకు సమంజసం అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తుడు న్యాయవాది అయిన క్యాస రఘునందన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బతికేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభా రాణి లు గ్రామంలో కొందరు తమకు అనుకూలంగా లేరనే ఒక్క కారణంతో గ్రామాన్ని విడదీయాలని చూస్తున్నట్లు ఆరోపించారు. అసలు ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకున్నా గ్రామాన్ని విడదీయడానికి ప్రతిపాదనలు ఎందుకని సూటిగా ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో బతకేపల్లి గ్రామానికి చెందిన కొండయ్యపల్లి, పుల్లయ్యపల్లి ప్రజలు పాల్గొన్నారు.