ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు.. గ్రామాల్లో వెలసిన పోస్టర్లు
ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు..? సీఎం రేవంత్ అంటూ..
దిశ,తంగళ్లపల్లి : ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఎప్పుడిస్తారు..? సీఎం రేవంత్ అంటూ.. గ్రామాల్లో పోస్టర్ లు వెలవడం తంగళ్ళపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్, తాడూరు గ్రామాలలోని గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు రైతు భరోసా కి సంబంధించి లెక్కలతో సహా ముద్రించిన పేపర్లను గోడలపై అంటించారు. ప్రభుత్వం ఒక్కో ఎకరాకు రైతుకు బాకీపడ్డా రూ. 17,500 చెల్లించాలని పోస్టర్లలో ముద్రించారు. ఈ పోస్టర్లు వేసింది నిజమైన రైతులా.. లేక బీఆర్ఎస్ నాయకులే వేశారా.. అనేది తేలాల్సి ఉంది.