ప్రింట్​, డిజిటల్ రంగాల్లో దిశ ప్రభంజనం

నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో అందిస్తున్న పత్రిక దిశ అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-09 09:14 GMT

దిశ, గన్నేరువరం : నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో అందిస్తున్న పత్రిక దిశ అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొంది డిజిటల్, ప్రింట్​ రంగాలలో ప్రభంజనం సృష్టించిందని కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో దిశ దినపత్రిక ముందంజలో ఉందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్, జిల్లా ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ బూర తిరుపతి, మాజీ ఈసీ మెంబర్ పాశం ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు దుడ్డు మల్లేశం, బద్దం సంపత్ రెడ్డి, కవ్వంపల్లి రాజయ్య, చింతల శ్రీధర్ రెడ్డి, చిటికూరి కొమురయ్య, నక్క తిరుపతి, బీజేపీ నాయకులు హరికాంతపు అనిల్, ప్రెస్ క్లబ్ సభ్యులు భీమనాతి వెంకటేష్, ఒద్నాల తిరుపతి, నల్లగొండ రామకృష్ణ, అధిక సంఖ్యలో మండల ప్రజలు పాల్గొన్నారు. 


Similar News