దిశ, ఎఫెక్ట్​... కొచ్చేరువు మత్తడిని సందర్శించిన కలెక్టర్

దిశ పత్రికలో బుధవారం వచ్చిన గంభీర్పూర్ కొచ్చేరువు మత్తడికి గండి శీర్షికకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ స్పందించారు.

Update: 2024-09-05 10:52 GMT

దిశ, కథలాపూర్ : దిశ పత్రికలో బుధవారం వచ్చిన గంభీర్పూర్ కొచ్చేరువు మత్తడికి గండి శీర్షికకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ స్పందించారు. ఆ చెరువును గురువారం సందర్శించారు. వివరాల్లోకి వెళితే గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామ కొచ్చేరువు మత్తడికి గండి పడిందనే విషయాన్ని దిశ పత్రిక వెలుగులోకి తీసుకవచ్చిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఈ విషయంలో ప్రభుత్వం విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.

మండలంలోని పలు గ్రామాల సందర్శన..

అనంతరం ఇప్పపెల్లి గ్రామ శివారులో గల మర్రోర్రె వాగు వద్ద ప్రధాన రోడ్డు పైన ఏర్పడిన గొయ్యి ని పరిశీలించారు. అలాగే పోతారం గ్రామం నుండి తండాకు వెళ్లే మార్గంలో ధ్వంసం అయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డీఓ నక్క శ్రీనివాస్, ఎంఆర్ఓ ఎండీ. ముంతజోద్దీన్, ఎంపీడీ ఓ శంకర్, ఎంపీఓ రాజశేఖర్, ఇరిగేషన్ డీఈ ప్రశాంత్, ఈఈ, ఏఈ రాజు, పంచాయతి రాజ్ ఏఈ, మాజీ సర్పంచ్ పోతు సిందూజ-రాజశేఖర్, కాంట్రాక్టర్ కల్లెడ గంగాధర్, కార్యదర్శి పోతుగంటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News