Tahsildar office : తహశీల్దార్ కార్యాలయం ముందు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా..

రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Update: 2024-11-05 09:03 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కోడెం కనకయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షులు కట్ట నాగభూషణ చారిలు మాట్లాడుతూ రిటైడ్ ఉద్యోగుల పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటిస్తూ, రెండవ పీఆర్సీని జులై 2023 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని కోరారు.

అలాగే అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లకు పెన్షన్ మంజూరు చేస్తూ, పెన్షనర్ల కమ్యూనికేషన్ తగ్గింపును 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు కుదించి స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి హెచ్ఎస్ స్కీం అమలు పరుస్తూ గ్రాడ్యుటి 20 లక్షలు పెంచాలన్నారు. పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ 3 వేలు రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్ సంఘం నాయకులు వెంకటయ్య చంద్రయ్య, బైరి ప్రకాష్, రామకృష్ణయ్య, సమ్మయ్య, వీరస్వామి, మల్లేష్, సాంబయ్య, కనకయ్య, శ్రీహరి, హరికృష్ణ, బుచ్చిరాజాం, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News