బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, పనిచేయని దద్దమ్మలను నమ్మొద్దు : ఎమ్మెల్యే

భారత రాష్ట్ర సమితి తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే

Update: 2023-10-08 09:48 GMT

దిశ, సుల్తానాబాద్ : భారత రాష్ట్ర సమితి తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం మండలంలోని కనుకుల, రాముని పల్లి లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను కే చంద్రశేఖర రావు రాష్ట్రంలో అమలు చేస్తూ, పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకాలను గమనించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడమే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని గత తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసి రాబోయే ఎన్నికల్లో మరోసారి ఓటు వేయాలని, అడుగుతున్నామన్నారు.

మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారన్నారు. గతంలో ఏ పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపామన్నారు. అధికారంలో ఉన్న నాడు ఏమి చేయలేని దద్దమ్మలు ఎన్నికల్లో పొందేందుకు అసత్యపు ప్రచారాలు చేస్తారన్నారు పెద్దపల్లి ప్రజలు దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదని మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా మూడో సారి అవకాశం ఇవ్వాలని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను దొంగ ప్రచారం చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News