రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం తో పాటు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.