'వచ్చినామా.. పోయామా కాకుండా రైతులను ఆదుకోవాలి'

Update: 2023-03-23 15:10 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన భాగంగా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మీరు నష్టపోయిన పంటలను పరిశీలించడానికి వచ్చినందుకు చాలా సంతోషం.. కానీ ఏదో వచ్చినమా, పోయినమా అన్నట్టు కంటి తుడుపు చర్యలు.. చేసి పోతే ఎలా అని.. రైతులు తీవ్రంగా నష్టం పోయారు. వారిని ఆదుకునే ప్రయత్నం కచ్చితంగా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉన్నప్పుడు పకృతి విపత్తు జరిగినప్పుడు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పంట నష్టపరిహారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పసుల వెంకటి దాట్ల వీరేశం, ఎండి జమాల్ ప్రసాద్ నరేందర్ రెడ్డి, మామిడి నరేష్, బద్దం రమణారెడ్డి, సంతోష్ బాబు, కాశి పాక, బాబు సుగుణాకర్ రెడ్డి, మల్లేశం మల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News