సిరిసిల్ల CESS ఎన్నికల నిర్వహణ‌లో గందరగోళం!

రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల నిర్వహణ తీరు గందరగోళానికి దారి తీస్తుంది. డైరక్టర్ స్థానాల్లో ఓటర్ల సంఖ్యను

Update: 2022-12-06 09:05 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల నిర్వహణ తీరు గందరగోళానికి దారి తీస్తుంది. డైరక్టర్ స్థానాల్లో ఓటర్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం.. పట్టణ ప్రాంత డైరక్టర్ స్థానాల్లో పక్కా మండలాల ఓటర్లను కలపడం వంటి చర్యలతో ఇటు ఓటర్లకు, అటు రాజకీయ నాయకులకు అంతుచిక్కకుండా ఉంది. ఏ నిబంధన ప్రకారం కలిపారో.. కూడా నివృత్తి చేయడానికి సిరిసిల్ల సెస్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఓ హెల్ప్ డెస్క్ కానీ, విచారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. సిరిసిల్ల టౌన్ 2 లో తంగళ్లపల్లి మండలానికి చెందిన 9 గ్రామాలను కలిపి 2131 ఓట్లను కలిపారు. దీంతో టౌన్ 2 ఓట్లు 5014 నుంచి 7145 కు పెరిగాయి.

వేమువాడ టౌన్‌లో కూడా అర్బన్ మండల ఓట్లు కలిపడంతో బీజేపి రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సిరిసిల్ల సెస్ కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారులకు వినతి పత్రం సమర్పించుదామని అడుగగా ఎన్నికల అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం, సెస్ అధికారులు సైతం ఈ వినతి పత్రం తాము తీసుకోమని, అన్ని ఎన్నికల అధికారులే చూసుకుంటారని పేర్కొనడంతో ఒక్కసారిగా బీజేపి నేత మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల సెస్ సంస్థను టీఆర్ఎస్ హాయాంలో నష్టాల్లోకి తీసుకువచ్చి రూ.400కోట్ల అప్పుల్లో ముంచారాని, సెస్ అధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందేందుకే ఓటర్ల జాబితాను తారుమాచేసి చేర్పులు, మార్పులు చేశారని, రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఇష్టానుసారంగా ముగించారన్నారు. బీసీ రిజర్వేషన్ కూడా కల్పించకపోవడం శోచనీమన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల పేరుతో ఓటు హక్కును తొలగించారన్నారు. బిల్లులు బకాయిలు ఉన్నవారికి పోటీ చేయడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, కానీ ఓటు వేసేలా ఓటు హక్కును కల్పించాలన్నారు. సెస్ ఎన్నికల నిర్వహణ అధ్వాన్నంగా, లోపభూయిష్టంగా ఉందన్నారు. అధికార పార్టీ ఏ విధంగా చెబితే ఆ విధంగా ఎన్నికల అధికారులు చేస్తున్నరని ఆరోపించారు. ఇప్పటికైన సెస్లో రిజర్వేషన్ ప్రక్రియను సరి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరోసారి కోర్టుకు వెళ్లి అధికారులను కోర్టు బోనులో దోషులుగా నిల్చోబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి సిరిసిల్ల పట్టణధ్యక్షులు అన్నల్ధాస్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News