రజాకార్ల అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్

రజాకార్ల అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్ ను ప్రజలు గద్దె దింపాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.

Update: 2023-04-05 09:35 GMT

దిశ, కరీంనగర్ టౌన్: రజాకార్ల అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్ ను ప్రజలు గద్దె దింపాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా బుధవారం ఉదయం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల బీజేపీ జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. సంజయ్ ఏం నేరం చేశాడని పోలీసు బలగాలతో అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఇందుకు భవిష్యత్తులో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాట లేకుండా పోయిందని, ప్రశ్నించే గొంతులను అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు బ్రిటిష్ , రజాకార్లు మార్గంలో నడుస్తోందన్నారు.

పోలీసులు చేతిలో ఉన్నారు కదా అని అరెస్టులని బీజేపీని భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ భయం పట్టుకుందని అరోపించారు. ఇటీవల కాలంలో ప్రశ్నాపత్రం లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందన్నారు. అలాగే బీజేపీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ చేస్తే.. దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో పూర్తి ఖర్చు భరిస్తానని కేసీఆర్ అనడంతో విషయం రాష్ట్రం ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్లపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, ఎడమ సత్యనారాయణ రెడ్డి, ఊగిలే సుధాకర్, దుబాల శ్రీనివాస్, దురిశెట్టి సంపత్, జాడి బాల్రెడ్డి, బండారు గాయత్రి, బల్బీర్ సింగ్, జమాల్, ఉప్పు రామకృష్ణ, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, తణుకు సాయి, మామిడి చైతన్య రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News