తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాల పెంపుకు కృషి : కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తరగతుల వారీగా సామర్థ్యం

Update: 2024-09-25 13:08 GMT

దిశ, గోదావరిఖని : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తరగతుల వారీగా సామర్థ్యం పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు. రామగుండం ఆర్జీ 1 ప్రాంతంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ఎన్టీపీసీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. సింగరేణి ఆర్జి 1 ప్రాంతంలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగం, క్యాజువాలిటీ, జనరల్ వార్డును పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్టీపీసీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న గణిత కాంప్లెక్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ద్వారా పొందుతున్న సమాచారాన్ని వినియోగించుకొని విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.తరగతుల వారీగా విద్యార్థుల సామర్ధ్యాలను పెంచేందుకు కృషి చేయాలని, బేస్ లైన్ పరీక్షలో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి, విద్యార్థులకు తరగతికి సంబంధించిన నైపుణ్యాలు పెంచుతూ కనీసం 80 శాతం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కోరారు.


Similar News