బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి : వేములవాడ ఎమ్మెల్యే

రానున్న బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి

Update: 2024-09-25 13:51 GMT

దిశ, వేములవాడ : రానున్న బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడం వలన గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుందని, రానున్న దసరా ,బతుకమ్మ, దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ పండగ నాటికి సరియైన ఏర్పాట్లు చేయాలన్నారు.

గ్రామాల్లో ప్రధాన కూడళ్లను సుందరంగా చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రతి వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని, ప్రభుత్వం అందించే సూచనలను సలహాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ డీపీఓ శేషాద్రి, డిఎల్పీఓ గీత, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News